[Verse 1]
పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా
రూపాయ్ ఉన్నోడికి రూపంతో పనిలేదు
పైసలు ఉన్నోడికి పనితో పనిలేదు
ధనమున్నోడే ఇక్కడ దర్జాగా ఉంటాడు
సంపాదన ఉన్నోడికి ఇక్కడ సలాం కొడతారు
[Verse 2]
పైసాఉంటే బిర్యాని వస్తది,
పైసాఉంటే బీరు వస్తది
పైసా ఉంటే కరెంట్ వస్తది,
పైసా ఉంటే ఇల్లు వస్తది
పైసా ఉంటే కారు వస్తది,
పైసా ఉంటే అమ్మాయి వస్తుంది,
పుణ్యం దక్కలన్నా పైసానే
పాపానీ కడగాలన్న పైసానే
ధనం మూలం ఇదం జగత్
[Verse 3]
స్నేహం నిలవాలన్నా
బంధుత్వం కలపాలన్న
కోటలు మెడలు కట్టాలన్న
కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న
ప్రాణం తీయాలన్న, ప్రాణం పోయాలన్నా
ఇది చేతులు మారే రాతలు మార్చే కాగితమోయ్
ఇది జేబుల నుంచి జేబులలోకి దూసుకేలే కాగితమాయే
[Verse 4]
ఈ ఊసరవెల్లికి రంగులు రెండే బ్లాక్ ఆర్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచేవాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైనా మరి
తను ఓడాలన్నా,గెలవాలన్నా అవసరమేనోయ్
పోయే ఊపిరి నిలవాలన్న,పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాకా కావాలోయ్ కాగితం.........